కాసేపట్లో తుక్కుగూడలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా

Union Home Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Home Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, BJP Public Meeting at Tukkuguda, Tukkuguda BJP Public Meeting, BJP Public Meeting, Amit Shah to address public meeting in Ranga Reddy, Amit Shah to address public meeting in Telangana, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Union Home Minister, Amit Shah, Telangana Tour, Union Home Minister Amit Shah Telangana Tour, Home Minister Amit Shah Telangana Tour, Amit Shah Telangana Tour, Amit Shah Telangana Tour News, Amit Shah Telangana Tour Latest News, Amit Shah Telangana Tour Latest Updates, Amit Shah Telangana Tour Live Updates, Tukkuguda BJP Public Meeting News, Tukkuguda BJP Public Meeting Latest News, Tukkuguda BJP Public Meeting Latest Updates, Tukkuguda BJP Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

బీజేపీ పార్టీ జాతీయనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో తెలంగాణ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాసేపట్లో ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు పర్యవేక్షించి, సూచనలు చేశారు. ఈసారి జన సమీకరణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడంతో, భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరు అయ్యారు.

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్:

మే 14, శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని (సీఎఫ్ఎస్‌ఎల్) సందర్శించారు. అక్కడ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎన్‌సిఎఫ్‌ఎల్)ను ప్రారంభించారు. అనంతరం సీఎఫ్ఎస్ఎల్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలోని నోవాటెల్‌ హోటల్ కు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే బీజేపీ కోర్‌ కమిటీ భేటీకి హాజరై నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరి 6:30 గంటలకు తుక్కుగూడ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. రాత్రి 8 గంటల లోపే అమిత్ షా సభను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. సభ అనంతరం అమిత్ షా తుక్కుగూడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని, రాత్రి 8:25 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here