కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Union Ministry of Culture to Organise Telangana Formation Day Celebrations in Delhi on June 2, Ministry of Culture to Organise Telangana Formation Day Celebrations in Delhi on June 2, Telangana Formation Day Celebrations in Delhi, TS formation day celebrations in Delhi, For the first time Centre to organise Telangana Formation Day celebrations in Delhi, Centre to celebrate Telangana formation day celebrations in Delhi, Telangana Day, Telangana Formation Day, Amit Shah to be chief guest at Telangana Formation Day celebrations in Delhi, Telangana Formation Day celebrations, Telangana Formation Day will be celebrated in Delhi on June 2, Union Home Minister Amit Shah will be the chief guest at the event, Union Home Minister Amit Shah, Telangana Formation Day News, Telangana Formation Day Latest News, Telangana Formation Day Latest Updates, Telangana Formation Day Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జూన్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. అలాగే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మరియు విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షిలేఖి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను సముచితమైన రీతిలో స్మరించుకునేలా జరుపుకోవడం ఇదే మొదటిసారి.

దేశంలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, సాంస్కృతిక వైభవం మరియు అన్ సంగ్ హీరోలను హైలైట్ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ గాయనీగాయకులు మంగ్లీ, వేదాల హేమచంద్ర సంగీత విభావరి ఉంటుందన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద హర్యానాలోని పాఠశాల పిల్లల ప్రదర్శనలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణకు చెందిన జానపద నృత్యకారులు మరియు ఢిల్లీ కథక్ కేంద్రం వారి ప్రదర్శనలతో తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం ప్రదర్శించబడుతుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =