24 అంతస్తులతో వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం – సీఎం కేసీఆర్

CM KCR, KCR govt to build a 24 floored multi-speciality hospital, KCR puts errant officials on notice, Mango News, Multispeciality Hospital, Multispeciality Hospital In Warangal, New hospital in Warangal must be a green building, Telangana CM KCR, Top 50 Multispeciality Hospitals in Warangal, Warangal, Warangal jail premises to house 24-storied hospital, Warangal Multispeciality Hospital, Warangal Multispeciality Hospital to be built, Warangal Multispeciality Hospital to be built with 24 stories, Warangal Multispeciality Hospital to be built with 24 stories with All Modern Facilities

కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇటీవలే 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాను 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడా మోడల్ లో, ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో దవాఖానా నిర్మాణముండాలని, వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు. ఆదివారం నాడు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై సీఎం కేసీఆర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సీఎం ఆకస్మిక తనిఖీలుంటాయని చెప్పారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానాకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here