జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్, సర్వీసు క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay, Bandi Sanjay writes a letter to CM KCR, Bandi Sanjay Writes Letter To CM KCR, Bandi Sanjay Writes Letter To CM KCR Over Junior Panchayat Secretaries, Bandi Sanjay Writes Letter To CM KCR Over Junior Panchayat Secretaries Pay Scale, Bandi Sanjay Writes Letter To CM KCR Over Junior Panchayat Secretaries Pay Scale Service Regulation, Bandi Sanjay’s letter to CM KCR, BJP Chief Bandi Sanjay, BJP Chief Bandi Sanjay Writes Letter To CM KCR, CM KCR, Mango News, Pay Scale Service Regulation, Telangana BJP President Bandi Sanjay, Telangana Politics

రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. “గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనది. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ నుండి మొదలు దోమల నివారణ చర్యల వరకు పదిరకాల పనులు నిర్వహిస్తున్నారు. అవి కాకుండా ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలను గ్రామాలలో అమలయ్యేవిధంగా నిత్యం శ్రమిస్తున్నారు. అయినా వీరికి నిత్యం అవమానాలు, ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులపై భౌతికదాడులు జరుగుతున్నాయి. దీనితో వారు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతున్నారు. కొన్నిచోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం” అని అన్నారు.

“పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపడం ప్రభుత్వం బాధ్యత. వీరి ఉద్యోగ భద్రతకు భరోసాను అవ్వాలి. ఖచ్చితమైన పని గంటలు నిర్ణయించడం, వారి రోజువారీ పనికి అవసరమైన సౌకర్యాల ఏర్పాటు, ప్రొబెషనరీ సమయం పూర్తి అయిన వారిని ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించడంతోపాటు, పేస్కేల్ అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తున్నది” అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here