కొత్త రకం మానసిక వేదనతో బాధపడుతున్న యువత

What is Tech Shaming,Tech Shaming,Tech Shaming Effect On Youth, What Is Tech Shame,Tech Shame At Work,Mango News,Mango News Telugu,Gen Z Tech Shaming ,Gen Z Tech Shaming, Generation Z,In case of use of equipment useful in professional life,Tech Shaming Effect On Youth Latest News,Tech Shaming Effect On Youth Latest Updates,Tech Shaming Latest News,Tech Shaming Latest Updates
Tech Shaming Effect On Youth, What Is Tech Shame,Tech Shame At Work,Gen Z Tech Shaming ,Gen Z Tech Shaming, Generation Z,In case of use of equipment useful in professional life

కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగు పెడుతున్న యువత..హుషారుగా దూసుకుపోవాల్సింది పోయి.. టెక్​ షేమింగ్‌తో బాధపడుతున్నారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.అయితే టెక్​ షేమింగ్ అంటే ఏమిటి? దీని వల్ల  ప్రమాదం ఉందా?  దీనికి  పరిష్కారం ఉందా? లేదా అని చాలామందిలో అనుమానాలు వినిపిస్తున్నాయి.  ప్రపంచానికి కంప్యూటర్లు పరిచయం అయిన కొత్తల్లో వాటిని వాడటం అప్పటివారికి  పెద్ద సవాలుగా ఉండేది. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో ఇబ్బందులు పడినా తర్వాత బాగానే అలవాటు అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కంప్యూటర్ విషయంలో సూపర్ కంప్యూటర్లుగా దూసుకుపోయారు.  1995-2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్‌ జెడ్‌గా పిలుస్తారన్న విషయం తెలిసిందే. అయితే  ఈ జనరేషన్ జెడ్ తరంవారు లేటెస్ట్ టెక్నాలజీకి అలవాటు పడినవాళ్లే అయినా  ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు మాత్రం  సాంకేతిక విషయాల్లో కొన్ని ఇబ్బందులకు గురువుతున్నారట. దీనినే ‘టెక్​ షేమ్​’ గా పిలుస్తున్నారు.

జెనరేషన్‌ జెడ్‌ యువత  ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు.. ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు.. లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ముందుగా ఈ టెక్​ షేమ్​ అనే పదాన్ని కంప్యూటర్లు తయారుచేసే హెచ్‌పీ కంపెనీ వాడింది. ప్రొఫెషనల్ లైఫ్‌లో  ఉపయోగపడే ఎక్విప్‌మెంట్స్ వినియోగం విషయంలో.. ఎక్కువగా యూత్ ఇబ్బందికి గురవుతున్నారని చెప్పడానికి  ఈ పదాన్ని ప్రయోగించింది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ టెక్నాలజీ రిలేటడ్ సమస్యను ఎదుర్కొంటున్నారని హెచ్‌పీ తెలిపింది. ప్రొఫెషనల్ లైఫ్‌‌లో  ఇలా టెక్నాలజీని వాడలేకపోవడాన్ని .. అసమర్థతగా జనరేషన్​ జెడ్​ వ్యక్తులు  భావిస్తున్నట్లు లాసల్లే ఏజెన్సీ చెప్పింది. పైగా ఏదైనా డౌట్ వస్తే వీరు తోటి వారిని అడగడానికి మొహమాట పడతున్నారట అంతేకాదు ఈ విషయంలో  అవతలి వారు ఏదైనా మాట అంటే దానిని అవమానంగా భావిస్తున్నారట.  అందుకే దీనిని టెక్‌షేమ్‌గా పేర్కొంటున్నారని లాసల్లే ఏజెన్సీ వెల్లడించింది.

జెనరేషన్​ జెడ్ తరం యువత ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. చిన్నతనం నుంచి లేటెస్ట్​ మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి గ్యాడ్జెట్స్​ను వినియోగించడంలో మిగిలిన వారి కంటే వీరే ముందే ఉంటున్నా కూడా..ప్రొఫెషనల్​ లైఫ్‌లో మాత్రం వీరు వెనుకంజలో ఉన్నారని సర్వేల్లో బయటపడింది. వీరు పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్‌  వాడటం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.  ప్రొఫెషనల్ లైఫ్‌లో వాడాల్సిన  డిజిటల్‌ సాధనాలను సరైన రీతిలో వాడలేకపోతున్నారట. ముఖ్యంగా గతేడాది గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉద్యోగాల్లోకి అడుగుపెట్టిన ఫ్రెషర్లో దాదాపు సగం మంది ఇలా టెక్నాలజీపరంగా ఇబ్బందిపడ్డారని లాసల్లే ఏజెన్సీ సర్వే చెబుతోంది.

ఈ టెక్ షేమింగ్‌ సమస్య చిన్న విషయంగానే కనిపించినా.. జెనరేషన్‌ జెడ్‌ యూత్ మాత్రం ఇది తమ సెల్ఫ్ రెస్సెక్ట్‌కు భంగం కలిగించే అంశంగానే  భావిస్తున్నట్లు  మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్​ షేమింగ్​ వల్ల  ఒంటరిగా ఫీలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా టెక్‌ షేమింగ్‌ ఇబ్బంది అన్ని వయస్సుల వారికీ సంబంధించిందే అయినా సరే.. జెనరేషన్‌ జెడ్‌ ఎంప్లాయిలపై మాత్రం దీని ప్రభావం ఎక్కువగా  ఉందని చెబుతున్నారు. టెక్​ షేమింగ్​  ప్రాబ్లెమ్‌కు చెక్ పెట్టడానికి.. కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులపై మేనేజర్‌ స్థాయి వ్యక్తులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =