తెలంగాణ లాసెట్-2022, పీజీ లాసెట్-2022 ఫలితాలు విడుదల

Telangana LAWCET-2022 PGLCET-2022 Results has Released Today, PGLCET-2022 Results has Released Today, LAWCET-2022 Results has Released Today, TS PGLCET-2022 Results, TS LAWCET-2022 Results, TS LAWCET And PGLCET 2022 results, TS LAWCET And PGLCET 2022 results News, TS LAWCET And PGLCET 2022 results Latest News And Updates, TS LAWCET And PGLCET 2022 results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో లాసెట్-2022, పీజీలాసెట్-2022 ప్రవేశ పరీక్షలను జూలై 20, 21 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా లాసెట్‌, పీజీలాసెట్ సెట్‌ ఫలితాలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫె‌సర్‌ ఆర్‌.లింబాద్రి విడుద‌ల చేశారు. 3 ఇయర్స్ లా కోర్సుకు సంబంధించి 74.76 శాతం ఉత్తీర్ణులు కాగా, 5 ఇయర్స్ లా కోర్సు ప్రవేశపరీక్షలో 68.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చైర్మ‌న్ ఆర్‌.లింబాద్రి తెలిపారు. అలాగే పీజీలాసెట్ లో 91.10 శాతం ఉత్తీర్ణత శాతం నమోదయిందన్నారు. రెండు సెట్స్ లో కలిపి 28,921 మంది హాజరుకాగా, మొత్తం 74 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

ఈ ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని లా కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం లాసెట్-2022, 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీలాసెట్-2022 నిర్వహించారు. నేడు ఫలితాలు విడుదల కాగా, ఇక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =