ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్‌

Andhra Pradesh Adimulapu Suresh Takes Charge as Minister of Urban Development, Adimulapu Suresh Takes Charge as Minister of Urban Development, Minister of Urban Development, Adimulapu Suresh Minister of Urban Development, Minister of Urban Development Of AP, Adimulapu Suresh took over as the Minister of Municipal Administration and Urban Development, Minister of Municipal Administration and Urban Development, Adimulapu Suresh Minister of Municipal Administration and Urban Development, Urban Development Minister, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్‌ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదిమూలపు సురేష్ పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత అధికారులను కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని తొలి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన ఆదిమూలపు సురేష్, ఇటీవల చేపట్టిన మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో అనూహ్యంగా మళ్ళీ మంత్రి పదవి దక్కించుకున్నారు.

అనంతరం ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ ‌రెడ్డి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని మంత్రి అన్నారు. ఇదిలావుండగా, కొత్తగా ఎన్నికైన మంత్రులు ఉషశ్రీ చరణ్ మరియు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రకాశం జిల్లా నుంచి రెండవసారి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక నాయకుడు సురేష్ కావడం విశేషం. ఉషశ్రీ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, కారుమూరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + thirteen =