ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం, 6గురు మృతి.. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

AP CM Jagan Announces Rs 25 Lakhs Ex-Gratia For Bereaved Families of Fire Mishap at Eluru, AP CM YS Jagan Mohan Reddy Announces Rs 25 Lakhs Ex-Gratia For Bereaved Families of Fire Mishap at Akkireddygudem Porous Chemical Factory in Eluru district, AP CM YS Jagan Mohan Reddy Announces Ex Gratia In Eluru Pharma Fire Incident, Condemning the tragic fire incident in Eluru, Eluru Pharma Fire Incident, Eluru Pharma Fire Incident At Porous Chemical Factory, massive fire broke out at the Akkireddygudem Porous Chemical Factory in Eluru district, massive fire broke out at the Porous Chemical Factory, Porous Chemical Factory, Pharma Fire Incident, National Defence Response Force, YS Jagan Mohan Reddy Announces Ex Gratia In Eluru Pharma Fire Incident, Ex Gratia In Eluru Pharma Fire Incident, Eluru Pharma Fire Incident News, Eluru Pharma Fire Incident Latest News, Eluru Pharma Fire Incident Latest Updates, Eluru Pharma Fire Incident Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద కల పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ ‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి పూర్తి స్థాయి వైద్య సహాయం అందించాల్సిందిగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఏలూరు కెమికల్‌ ఫ్యాక్టరీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ యూనిట్-4లో అర్ధరాత్రి రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు. ప్రమాదం జరిగిన యూనిట్-4 బ్లాక్‌లో మొత్తం 30 మంది పనిచేస్తున్నారు. వీరిలో 13 మంది గాయపడ్డారు. వీరిలో 12 మందికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి తెలిపారు.

పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది మరియు ఇతర అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నూజివీడు డీఎస్పీ, సీఐ, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై నూజివీడు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందిస్తూ.. హై ప్రెషర్ వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతానికి పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 19 =