పోరస్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వండి, ప్రభుత్వానికి జనసేనాని పవన్‌ కల్యాణ్ డిమాండ్

Pawan Kalyan Demands AP Govt To Give One Crore Rupees As Compensation For Eluru Victims Families, AP Govt To Give One Crore Rupees As Compensation For Eluru Victims Families, Janasena Chief Pawan Kalyan Demands AP Govt To Give One Crore Rupees As Compensation For Eluru Victims Families, Eluru Victims Families, Janasena Chief Pawan Kalyan, Janasena Chief, Pawan Kalyan, Condemning the tragic fire incident in Eluru, Eluru Pharma Fire Incident, Eluru Pharma Fire Incident At Porous Chemical Factory, massive fire broke out at the Akkireddygudem Porous Chemical Factory in Eluru district, massive fire broke out at the Porous Chemical Factory, Porous Chemical Factory, Pharma Fire Incident, National Defence Response Force, YS Jagan Mohan Reddy Announces Ex Gratia In Eluru Pharma Fire Incident, Ex Gratia In Eluru Pharma Fire Incident, Eluru Pharma Fire Incident News, Eluru Pharma Fire Incident Latest News, Eluru Pharma Fire Incident Latest Updates, Eluru Pharma Fire Incident Live Updates, Mango News, Mango News Telugu,

గురువారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 6గురి కుటుంబాలకు.. కుటుంబానికి కోటి రూపాయల వంతున నష్టపరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు పవన్ కళ్యాణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వద్ద పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఘటన అత్యంత విషాదకరమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, అలాగే వారికి అందించే నష్టపరిహారం పెంచాలని కోరారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాగా ఏలూరు ప్రమాద ఘటనలో మృతుల కటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరపున రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని కూడా ప్రతాప్‌ వెల్లడించారు. అయితే ఈ నష్టపరిహారం సరిపోదని.. రూ. 1 కోటి ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు. ఇంతకుముందు విశాఖపట్టణం సమీపంలోని ఎల్జీ పాలీమర్స్ కనీలో చోటుచేసుకున్న ఫర్నేస్ బ్లాస్ట్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్ట పరిహారం ప్రకటించిన విషయాన్నీ గుర్తుచేశారు. రాష్ట్రంలోని కెమికల్‌ ఫ్యాక్టరీలలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ద్దెనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని పవన్ కోరారు. ఆయా కంపెనీలు కూడా ప్రమాణాలు పాటించాలని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =