త్వరలోనే ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ? నేతల్లో ఉత్కంఠ…

Andhra Pradesh Cabinet Reshuffle Likely to Held on April 11th, Andhra Pradesh Cabinet Reshuffle, Cabinet Reshuffle, Andhra Pradesh Cabinet, AP CM YS Jagan Mohan Reddy Likely To Be Reshuffle to Held on April 11th, AP CM YS Jagan Mohan Reddy Likely To Be Reshuffle of Cabinet, CM YS Jagan Mohan Reddy Likely To Be Reshuffle of Cabinet Very Soon, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM Jagan, Reshuffle of Cabinet, Ap Cabinet Reshuffle, YS Jagan, Jagan Mohan Reddy, AP Cabinet, Cabinet, AP Cabinet Latest News, AP Cabinet Latest Updaates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పదవీ కాలంలో తొలిసగం పూర్తయ్యాక మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయని, కొత్తవారికి అవకాశం ఇస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు తీరనున్నట్టు సమాచారం. తాజా పరిణామాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకుంది.

ముందుగా ప్రస్తుత ఏపీ మంత్రిమండలి ఏప్రిల్ 7వ తేదీన సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం సందర్భంగా కొత్త మంత్రివర్గం వివరాలను సహచరులకు సీఎం వైఎస్ జగన్ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఇద్దరూ లేదా ముగ్గురికి మళ్ళీ అవకాశం ఇవ్వడం, ఐదుగురు డిప్యూటీ సీఎంల విధానాన్ని కొనసాగించడం, కొత్త జిల్లాల వారీగా నేతలకు మంత్రిమండలిలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 7న మంత్రివర్గ సమావేశం అనంతరం, ఏప్రిల్ 8న సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ తో సమావేశమై మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించనున్నట్టు సమాచారం. ఏపీలో కొత్తగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి? ప్రస్తుత మంత్రుల్లో ఎవరూ మళ్ళీ కొనసాగనున్నారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + ten =