ఏపీలో ఈసెట్-2023, ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh: ECET-2023 and ICET-2023 Entrance Exams Schedule Released,Andhra Pradesh ECET-2023,Andhra Pradesh ICET-2023,ECET-2023 Entrance Exams Schedule,ICET-2023 Entrance Exams Schedule,Mango News,Mango News Telugu,AP ECET 2023 exam date announced,Andhra Pradesh AP EAPCET 2023 notification,AP ECET Latest News,AP ICET Live Updates,ECET-2023 Exams Schedule Live Updates,Andhra Pradesh ICET-2023 Updates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించే ఈసెట్-2023, ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయింది. రాష్ట్రంలో 2023-24 సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనుండగా, ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ మరియు ఐసెట్‌ పరీక్షను అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈసెట్ మే 5వ తేదీన, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఏపీ ఈసెట్-2023 పూర్తి షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 8
  • దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ: మార్చి 10
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 10
  • రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15
  • రూ.2000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 19
  • రూ.5,000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 24
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : ఏప్రిల్ 28 నుండి
  • ఈసెట్ పరీక్ష నిర్వహణ : మే 5.

ఏపీ ఐసెట్-2023 పూర్తి షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 17
  • దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ: మార్చి 20
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 19
  • రూ.1000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26
  • రూ.2000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 27 నుంచి మే 3
  • రూ.3000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: మే 4 నుంచి మే 10
  • రూ.5000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: మే 11 నుంచి మే 15
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: మే 16 నుంచి మే 17 వరకు
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 20నుండి
  • ఐసెట్ పరీక్ష నిర్వహణ : మే 24, 25.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =