ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు

Andhra Pradesh New Cabinet Ministers Swearing-in Ceremony Live Updates, Andhra Pradesh New Cabinet Ministers Swearing-in Ceremony News, Andhra Pradesh New Cabinet Ministers Swearing-in Ceremony Latest News, Andhra Pradesh New Cabinet Ministers Swearing-in Ceremony Latest Updates, Andhra Pradesh New Cabinet Ministers Swearing-in Ceremony, AP New Cabinet Ministers Swearing-in Ceremony, Andhra Pradesh New Cabinet Ministers, AP new Cabinet ministers, 25 new Cabinet ministers, new Cabinet ministers, AP New Cabinet, AP Cabinet reshuffle, Andhra Pradesh Cabinet reshuffle, Andhra Pradesh, Andhra Pradesh Cabinet, YS Jagan Mohan Reddy Cabinet reshuffle, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2019లో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల తర్వాత తన మంత్రివర్గాన్ని మళ్ళీ పునర్‌ వ్యవస్థీకరిస్తున్నారు.

ముందుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం వరుసగా అక్షర క్రమంలో అంజాద్‌ బాషా (కడప), ఆదిమూలపు సురేష్‌ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (డోన్), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), దాడిశెట్టి రాజా (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్‌నాథ్‌ (అనకాపల్లి), గుమ్మనూరు జయరాం (ఆలూరు), జోగి రమేష్‌ (పెడన), కాకాణి గోవర్థన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు), ఉషాశ్రీ చరణ్‌ (కళ్యాణదుర్గం), మేరుగ నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపే విశ్వరూప్‌ (అమలాపురం), రాజన్న దొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), సీదిరి అప్పలరాజు (పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజిని (చిలకలూరిపేట) ప్రమాణస్వీకారం చేశారు.

కాగా ఏప్రిల్ 7వ తేదీన మొదటివిడతలో బాధ్యతలు చేపట్టిన 24 మంది మంత్రులు తమ రాజీనామాలు సమర్పించగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వాటికీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం తాజాగా కొత్త కేబినెట్ లో మొత్తం 25 మందికి చోటు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే 25 మందిలో గతంలో పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంజాద్‌ భాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేష్‌ వంటి 11 మంది మంత్రులను మరోసారి కొనసాగిస్తునట్టు ప్రకటించారు. అలాగే కొత్తగా మరో 14 మందికి సీఎం వైఎస్ జగన్ కల్పించారు. మరోవైపు ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో కొత్త మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ తర్వాత సచివాలయంలో తేనీటి విందు కార్యక్రమం జరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =