ఏపీలో నూతన కేబినెట్ : ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు ఇవే…

Andhra Pradesh Full List of Ministers and Their Portfolios in CM YS Jagan Cabinet, Full List of Ministers and Their Portfolios in CM YS Jagan Cabinet, AP new Cabinet ministers Portfolios, CM YS Jagan Cabinet, AP new Cabinet ministers Portfolios In AP CM YS Jagan Cabinet, Full List of Ministers and Their Portfolios, Andhra Pradesh New Cabinet Ministers, AP new Cabinet ministers, 25 new Cabinet ministers, new Cabinet ministers, AP New Cabinet, AP Cabinet reshuffle, Andhra Pradesh Cabinet reshuffle, Andhra Pradesh, Andhra Pradesh Cabinet, YS Jagan Mohan Reddy Cabinet reshuffle, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. శాఖల కేటాయింపుపై సీఎం వైఎస్ జగన్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం శాఖల కేటాయింపు వివరాలను ప్రకటించింది. గత ఏపీ కేబినెట్‌లో లాగానే ఈసారి కూడా ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడులకు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించారు.

ఏపీలో మంత్రులు – శాఖలు కేటాయింపు:

  1. బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
  2. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, ఫారెస్ట్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ
  3. ఆదిమూలపు సురేష్ – మున్సిపల్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ
  4. తానేటి వనిత – హోమ్ శాఖ
  5. విడుదల రజని – వైద్య ఆరోగ్య శాఖ
  6. ధర్మాన ప్రసాద రావు – రెవెన్యూ శాఖ
  7. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
  8. అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
  9. కాకాని గోవర్దన్ రెడ్డి – వ్యవసాయం, సహకార మార్కెటింగ్ శాఖ
  10. సిదిరి అప్పల రాజు – మత్స, పశుసంర్ధక శాఖ
  11. గుడివాడ అమరనాథ్ – పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ
  12. బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ
  13. దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాలు శాఖ
  14. చెల్లుబోయిన వేణుగోపాల్ : ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రపి, బీసీ సంక్షేమం శాఖలు
  15. పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ
  16. రాజన్న దొర – గిరిజన సంక్షేమ శాఖ
  17. అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమ శాఖ
  18. కారుమూరి నాగేశ్వర రావు – పౌర సరఫరాల శాఖ
  19. కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ
  20. జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
  21. మేరుగు నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
  22. ఉషశ్రీ చరణ్ – మహిళా శిశు సంక్షేమ శాఖ
  23. ఆర్కే రోజా – టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ
  24. నారాయణ స్వామి – ఆబ్కారీ/ఎక్సైజ్‌ శాఖ
  25. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 1 =