మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…

Janasena Party 10th Formation Day Meeting on March 14th: Pawan Kalyan Tour and Programs Schedule,Janasena Party 10th Formation Day,Janasena Formation Day Meeting,Janasena Meeting on March 14th,Pawan Kalyan Tour Schedule,Pawan Kalyan Programs Schedule,Mango News,Mango News Telugu,Janasena Formation Day at Machilipatnam,Pawan Kalyan to Reach Venue,Pawan Kalyan on Varahi Vehicle,Janasena Chief Pawan Kalyan,AP Politics,AP Latest Political News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena Formation Day Latest Updates

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొననున్నారు. మార్చి 11వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకుంటారు. ఈ మేరకు మార్చి 11 నుంచి మార్చి 14 వరకు పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల షెడ్యూల్ ను జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

పవన్ కళ్యాణ్ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే:

  • మార్చి 11: మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం.
  • మార్చి 12: ఉదయం 11గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష, పార్టీలో చేరికలు. మధ్యాహ్నం 2 గంటలకు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ.
  • మార్చి 13: ఉదయం 11గంటలకు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష. సాయంత్రం 5 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ.
  • మార్చి 14: మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం సభకు బయలుదేరడం. 2 గంటలకు ఆటోనగర్ గేట్ దగ్గర స్వాగతం. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు గుడివాడ సెంటర్ (బైపాస్ దగ్గర) మీదుగా సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + five =