ఏపీ బడ్జెట్ 2023-24 – లైవ్ అప్‌డేట్స్

Andhra Pradesh State Annual Budget 2023-24 Live Updates,Andhra Pradesh Budget, State Annual Budget 2023-24,Andhra Pradesh Budget Live Updates,Mango News,Mango News Telugu,CM YS Jagan Speech in AP Budget Assembly Session,AP Budget Assembly Session,AP Assembly Sessions 2023,AP Budget Sessions Latest News,AP CM YS Jagan Budget Session Live News,AP Assembly Sessions 2023,AP Budget Sessions Latest News,AP Annual Budget News Today,AP Annual Budget Latest News,AP Annual Budget Live News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ను రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించింది. ఇక శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసన మండలిలో పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు. ముందుగా గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 కి ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, అధికారులు కలిసి బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ కు అంద‌జేశారు

ఏపీ బడ్జెట్ 2023-24 హైలైట్స్:

  • బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.2,79,297 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,28,540 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.31,061 కోట్లు
  • రెవెన్యూ లోటు: రూ.22,316 కోట్లు
  • ద్రవ్య లోటు: రూ.54,587 కోట్లు

బడ్జెట్ కేటాయింపులు:

  • అమ్మ ఒడి పథకం – రూ.6,500 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా కేటాయింపులు – రూ.4,020 కోట్లు
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక – రూ.21,434.72 కోట్లు
  • జగనన్న విద్యాదీవెన – రూ.2,841.64 కోట్లు
  • జగనన్న వసతి దీవెన – రూ.2,200 కోట్లు
  • మనబడి నాడు-నేడు పథకం కేటాయింపులు – రూ.3,500 కోట్లు
  • వైఎస్ఆర్ వాహనమిత్ర – రూ.275 కోట్లు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
  • జగనన్న చేదోడు పథకం – రూ.350 కోట్లు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం – రూ. 550 కోట్లు
  • వైఎస్ఆర్ చేయూత – రూ.5000 కోట్లు
  • ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
  • వైఎస్ఆర్-పీఎం బీమా యోజన – రూ.1600 కోట్లు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం – రూ.125 కోట్లు
  • మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ రూ.50 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ కోసం – రూ.1,212 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం కేటాయింపు – రూ.1,000 కోట్లు
  • రైతులకు వడ్డీలేని రుణాలు కోసం కేటాయింపు – రూ.500 కోట్లు
  • పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.15,873 కోట్లు
  • మున్సిపల్, పట్టణాభివృద్ధి కోసం – రూ.9,381 కోట్లు
  • ఈబీసీ నేస్తం కోసం – రూ.610 కోట్లు
  • వైఎస్ఆర్ కల్యాణమస్తు – రూ.200 కోట్లు
  • వైఎస్ఆర్ ఆసరా – రూ.6700 కోట్లు
  • రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
  • లా వేస్తం – రూ.17 కోట్లు
  • జగనన్న తోడు- రూ.35 కోట్లు
  • జగనన్న విద్యా కానుక – రూ.560 కోట్లు
  • యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ శాఖ – రూ.1,291 కోట్లు
  • స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయింపులు – రూ.1,166 కోట్లు
  • పేదలందరికీ ఇళ్లు పథకం కోసం – రూ.5,600 కోట్లు
  • ఎస్సీ డెవలప్మెంట్ – రూ.20,005 కోట్లు
  • ఎస్టీ డెవలప్మెంట్ – రూ.6,929 కోట్లు
  • బీసీ డెవలప్మెంట్ – రూ. 38,605 కోట్లు
  • మైనార్టీ డెవలప్మెంట్ – రూ.4,203 కోట్లు
  • కాపు సంక్షేమం – రూ.4,887 కోట్లు
  • ఇరిగేషన్ డెవలప్మెంట్ – రూ.11,908 కోట్లు
  • పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ – రూ.685 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం కోసం – రూ.2,602 కోట్లు
  • ఎనర్జీ శాఖ – రూ.6,456 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
  • గడపగడకు మన ప్రభుత్వం – రూ.532 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయ శాఖ – రూ.3,858 కోట్లు
  • మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం – రూ.3,951 కోట్లు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =