టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రద్దు

TSPSC Decided to Cancel The Assistant Engineer Examination which held on 2023 March 5th,TSPSC Decided to Cancel Examination,Assistant Engineer Examination Cancelled,TSPSC Cancel Examination on 2023 March 5th,Mango News,Mango News Telugu,TSPSC Assistant Engineer Exam 2023,TSPSC Cancels Engineer Recruitment Exam,TSPSC Scraps March 5 Engineers Exam,TSPSC Case, Telangana TSPSC Live News, TSPSC Question Paper Leak Case,TSPSC Paper Leak Scam, TSPSC Paper Leak Scam Latest News,TSPSC Assistant Engineer Examination Latest News

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లీకేజి నేపథ్యంలో మార్చి 5న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మార్చి 15, బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. “వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు మరియు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల పోస్టులతో కూడిన 837 ఖాళీల కోసం టీఎస్‌పీఎస్సీ 2022, సెప్టెంబర్ 12న నోటిఫికేషన్ నెం.16/2022ను విడుదల చేసింది. ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ద్వారా 2023, మార్చి 14న నమోదైన ఎఫ్‌ఐఆర్ నెం.95/2023 ని నిశితంగా పరిశీలించిన కమిషన్, ఆయా పోస్టుల భర్తీ కోసం 2023, మార్చి 5న జరిగిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను తర్వాత ప్రకటిస్తాం” అని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు సంస్థలో కంప్యూటర్స్ హ్యాకింగ్‌ కు గురైనట్టు గుర్తించడంతో మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో), మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను కూడా ప్రస్తుతానికి వాయిదా చేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అందరికీ వారి సంబంధిత సెల్‌ నంబర్లకు మెసేజ్‌ ద్వారా సమాచారం అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =