ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Andhra Gram Panchayat elections, Andhra Pradesh panchayat elections, Andhra Pradesh Panchayat Polls, AP Gram Panchayat Elections, AP Panchayat Elections, AP Panchayat polls, Gram Panchayat Elections In AP, High Court Judgement on Panchayat Elections, Mango News, Panchayat Elections in AP, Supreme Court Gives Green Signal to AP Panchayat Elections, Supreme Court Over Panchayat Elections Approval, YSRCP Minister To Move Supreme Court

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేపట్టింది. కరోనా సమయంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కేరళ కూడా ఎన్నికల నిర్వహించింది, ఇప్పుడు కరోనా కేసుల్లో పెరుగుదల ఉన్నప్పటికీ ఎన్నికలు కారణమని చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘాల జోక్యంపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ) వ్యతిరేకంగా ఉద్యోగ సిబ్బంది వ్యహరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది. ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =