సీబీఐ మాజీ డైరెక్టర్‌, మాజీ మంత్రి కె.విజయరామారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

CM KCR Expresses Shock over the Death of Former CBI Director Former Minister K Vijaya Rama Rao,CM KCR Expresses Shock,Death of Former CBI Director,Former Minister K Vijaya Rama Rao,Former CBI Director K Vijaya Rama Rao,Mango News,Mango News Telugu,Vijaya Rama Rao Passes Away,Former Minister K Vijayarama Rao passes,Ex CBI director Vijaya Rama Rao,Telangana Political News And Updates,Telangana Latest News,Vijaya Rama Rao Latest News,Former CBI Director Rama Rao News Today

సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here