సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి

AP Atmakur MLA Mekapati Vikram Reddy Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, Atmakur MLA Mekapati Vikram Reddy Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, MLA Mekapati Vikram Reddy Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, MLA Vikram Reddy Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, Mekapati Vikram Reddy Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, AP Atmakur MLA Meets CM YS Jagan Mohan Reddy at Tadepalli, CM YS Jagan Mohan Reddy, AP Atmakur MLA Mekapati Vikram Reddy, Atmakur MLA Mekapati Vikram Reddy, MLA Mekapati Vikram Reddy, Mekapati Vikram Reddy, AP Atmakur MLA, Tadepalli, AP Atmakur MLA Mekapati Vikram Reddy News, AP Atmakur MLA Mekapati Vikram Reddy Latest News, AP Atmakur MLA Mekapati Vikram Reddy Latest Updates, AP Atmakur MLA Mekapati Vikram Reddy Live Updates, Mango News, Mango News Telugu,

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. సోమవారం నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు, మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రావుతో కలిసి మేకపాటి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌ రెడ్డిని సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. సీఎంతో భేటీ అనంతరం ఎమ్మెల్యే విక్రమ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. వచ్చే నెలలో అన్న గౌతమ్ రెడ్డి పేరుతో నిర్మించిన సంగం బ్యారేజినీ సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇక నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని విక్రమ్‌ రెడ్డి తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eight =