ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

AP Cabinet Key Decisions Early Release of Irrigation Water Ammavodi Scheme on June 21st, AP Cabinet Key Decisions, Early Release of Irrigation Water, Ammavodi Scheme on June 21st, AP CM YS Jagan will Chair Cabinet Meeting Today Likely to Take Key Decisions, AP CM YS Jagan will Chair Cabinet Meeting Today, AP CM YS Jagan Likely to Take Key Decisions, AP CM YS Jagan Mohan Reddy To Chair Cabinet Meeting Today, First Cabinet Meeting After Reshuffle, YS Jagan Mohan Reddy To Hold 1st Cabinet Meeting After Reshuffle On May 13, Andhra Pradesh New Cabinet Will Meet on May 13th, Andhra Pradesh CM Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, CM Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, AP CM YS Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, YS Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, AP CM to hold first Cabinet meeting on May 13, first Cabinet meeting on May 13, AP CM to hold first Cabinet meeting, AP New Cabinet Will Meet on May 13th, Andhra Pradesh New Cabinet, AP New Cabinet, AP New Cabinet News, AP New Cabinet Latest News, AP New Cabinet Latest Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మే 12, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి మీడియాకు వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ను ముందుగానే ప్రారంభించాలని, అందుకు అవసరమైన సాగునీటిని ముందుగానే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మూడో పంటకు కూడా అనుకూలంగా ఉండేలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సాగునీటిని అడ్వాన్స్‌డ్‌గా విడుదల చేసే కార్యక్రమం చేపడుతున్నట్టు మంత్రులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

 • జూన్‌ 1 గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల, గోదావరి డెల్టా పరిధిలో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు నిల్వ ఉన్న నేపధ్యంలో ముందస్తుగానే నీటి విడుదలకు ఆమోదం.
 • జూన్‌ 10న కృష్ణా డెల్టాకు సాగునీరు, జూన్‌ 10న గుంటూరు ఛానల్, జులై 15 నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ) పరిధిలో నీటి విడుదల.
 • జూన్‌ 10న పెన్నాబేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగళ్ళు నుంచి సాగునీరు విడుదల, జూన్‌ 30న ఎస్‌ఆర్‌బీసీ పరిధిలోని గోరకల్లు అవుకు ప్రాజెక్టుల కింద నీటి విడుదల, పోలవరం సూయిజ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల డెడ్ స్టోరేజ్ నుండి నీటిని విడుదల చేయడానికి అవకాశం.
 • మే 13 న మత్స్యకార భరోసా పథకం అమలు
 • మే 16న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు
 • మే 19న వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్యసేవ-అంబులెన్స్‌లు ప్రారంభం.
 • జూన్‌ 6న రైతు భరోసా కేంద్రాల పరిధిలో 3000 ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హర్వెస్టర్‌లు, ఇతర వ్యవసాయ ఉపకరణాల పంపిణీ
 • జూన్‌ 14న వైఎస్ఆర్ పంటల బీమా పరిహారం చెల్లింపు
 • జూన్‌ 21న అమ్మ ఒడి పథకం అమలు
 • రూ.8.18 కోట్లతో కృష్ణాజిల్లా పామర్రులో పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం, 38 అదనపు పోస్టులు మంజూరు
 • పులివెందులలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు
 • నెల్లూరుజిల్లా ఉదయగిరిలో ఎంఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరుతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. ఉచితంగా భవనాలు, 100 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటు.
 • ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో భాగంగా పలు ప్రోత్సాహకాలకు కేబినెట్‌ ఆమోదం.
 • ఏపీ లాజిస్టిక్స్‌పాలసీ 2022–27లో భాగంగా పలు ప్రోత్సహకాలకు కేబినెట్‌ ఆమోదం.
 • నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో బయోఇథనాల్‌ ప్లాంట్‌పెట్టనున్న క్రిబ్‌కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు కారణంగా ఎరువులకు బదులు బయోఇథనాల్‌ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్‌కోకు కేబినెట్‌ ఆమోదం
 • ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తలో 16 అదనపు పోస్టులకు ఆమోదం
 • ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
  మచిలీపట్నంలో అత్యాధునిక వైద్యసదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రికోసం ఎకరా భూమి కేటాయింపు
 • ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికోసం 3 ఎకరాలు భూమి కేటాయింపు
 • నెల్లూరు రూరల్‌మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికై 4 ఎకరాల భూమి కేటాయింపు
 • వైఎస్ఆర్ కడపజిల్లా చిన్నమాచిపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్‌ హబ్‌కింద ఏర్పాటుకానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు
 • సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరు, పడమటికండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేటాయింపు
 • పెనుగొండ డివిజన్‌ మడకశిర మండలం ఆర్‌.అనంతపురంలో 235 ఎకరాలు ఇండస్ట్రియల్‌పార్క్‌ కోసం ఏపీఐఐసీకి కేటాయింపు, ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు.
 • మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు, ఇదే గ్రామంలో 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు, ఇక్కడ ఫుడ్‌ప్రాససింగ్, పశుసంవర్థక, మినరల్స్‌ మరియు టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
 • పెనుగొండలో మెగా స్పిరిట్యువల్‌ సెంటర్, టూరిస్ట్‌ బేస్‌క్యాంప్‌కు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం
 • తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపు
 • అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిస్టార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపు
 • కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు, ఇక్కడ రిసార్ట్‌కట్టనున్న ఏపీటీడీసీ.
 • విశాఖపట్నం జిల్లాలో ఎండాడలో కాపు భవన్‌ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపు
 • బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్, వేస్ట్‌ కంపోస్ట్‌ ప్లాంట్‌ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయింపు
 • నంద్యాలజిల్లా ప్యాపిలిలో హార్టీకల్చర్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కాంప్లెక్స్‌కోసం 25.93 ఎకరాలు కేటాయింపు
 • బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు, ఆమేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్‌ ఆమోదం.
 • పాస్టర్లకు గౌరవవేతనం ఇస్తూ గతంలో జారీచేసిన జీవో సవరణకు కేబినెట్‌ ఆమోదం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here