వైఎస్సార్‌ కడప జిల్లా వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM Jagan Inaugurates Village Secretariat Complex in Velpula YSR Kadapa District Today, Jagan Inaugurates Village Secretariat , AP CM Jagan Inaugurates Velpula Secretariat, AP CM Jagan Inaugurates Village Secretariat Complex, Mango News, Mango News Telugu, Velpula Village Secretariat Complex , Velpula Secretariat Complex YSR Kadapa District, YSR Kadapa District , AP CM YS Jagan Mohan Reddy, Velpula Secretariat Complex Opening, Velpula YSR Kadapa District

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం కాంప్లెక్స్‌ సముదాయంలో ఆయన కలియతిరిగి పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందించనున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 వరకు వివిధ సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో వేల్పులలో కూడా ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు నిర్మించారు. ఇక రేపు 2వ తేదీ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. సీఎం జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు జరిపి నివాళులు అర్పించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here