వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు: సీఎం జగన్

Andhra Pradesh CM Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Decides to Give Awards for Village/Ward Volunteers, AP Village/Ward Volunteers, Awards for Village/Ward Volunteers in 3 Categories, CM YS Jagan to honour volunteers, CM YS Jagan to honour volunteers on Ugadi, Jagan proposes awards for volunteers, Jagan proposes awards for volunteers in Andhra Pradesh, Mango News, Village/Ward Volunteers In AP

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2.6 లక్షల మంది గ్రామా, వార్డు వాలంటీర్లు సేవలనందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అర్హతల ఆధారంగా 3 కేటగిరీల్లో వాలంటీర్ల ఎంపిక అనంతరం ఉగాది నుంచి వారికీ పురస్కారాల అందజేత కార్యక్రమం నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలకు స్వయంగా హాజరవుతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

ఈ 3 కేటగిరీల్లో వాలంటీర్ల ఎంపికకు సంబంధించి మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ చేయడం, కోవిడ్‌–19 సర్వే, రోజువారీ హాజరు, యాప్‌ల వినియోగ తీరు, ప్రభుత్వ నవరత్నాల కార్యక్రమాల అమల్లో భాగస్వామ్యం అయ్యే విధానం, సచ్ఛిలత వంటి అంశాలను అర్హత/ప్రామాణికంగా తీసుకోనున్నారు. 1వ కేటగిరి కింద ఏడాదిపాటుగా నిరంతరంగా సేవలు అందించిన వాలంటీర్ల పేర్లు పరిశీలనలోకి తీసుకోనున్నారు. ఈ కేటగిరిలో ఎంపికైన గ్రామా/వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, మరియు రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నారు.

ఇక 2వ కేటగిరి కింద ప్రతి మండలం/పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేసి సేవారత్న పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు. అలాగే 3వ కేటగిరి కింద రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేయనున్నారు. వీరికి సేవా వజ్రంపేరిట పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటుగా మెడల్ మరియు రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివక్ష లేని లంచాలు లేని మంచి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా మార్పు తీసుకొస్తూ పనిచేస్తున్న వాలంటీర్లకు మరింత ఉత్సాహం అందించడంలో భాగంగానే ఈ పురస్కారాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 3 =