జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Panchayat Election, Andhra Pradesh Panchayat Election 2021, Andhra Pradesh Panchayat Election Results, Gram panchayat polls, janasena chief, janasena chief pawan kalyan, Janasena Party Performance in Panchayat Elections, Mango News, pawan kalyan, Pawan Kalyan Janasena, Pawan Kalyan Latest News, Pawan Kalyan Response over Party Performance in Panchayat Elections

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 27శాతం ఓటింగ్ జనసేనకు దక్కిందని, యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయమిదని పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడం, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ముందుకు వెళ్లాం. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు దశల్లో 1209 సర్పంచ్, 1776 ఉప సర్పంచ్, 4456 వార్డుల్లో జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం చాలా సంతోషానిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాం. ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 71 శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాం. చాలా మంది అభ్యర్థులు విజయం ముంగిట 10 నుంచి వంద ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మొత్తం మీద 27 శాతం ఓటింగును జనసేన పొందింది. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్లను జనసేన కైవశం చేసుకుంది. ఈ విజయం చాలా తృప్తినిచ్చింది. నేను చెబుతున్న ఈ గణంకాలు చాలా కన్సర్వేటివ్ గా చెబుతున్న గణంకాలు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం:

“ఈ విజయానికి ముఖ్య కారకులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జనసైనికులు, కుల రాజకీయాలకు, అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన ఆడపడుచులు, వీరమహిళల విజయం ఇది. డబ్బుతో రాజకీయం కాకుండా ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయం ఇది. ఒక్క రూపాయి కూడా పంచకుండా, దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో జనసైనికులు బలంగా నిలిచారు. వాళ్లపై దాడులు జరుగుతున్నా, అధికార మదంతో అధికార పక్షం వాళ్ళు తలలు పగలగొట్టినా రక్తసిక్తం చేసినా, కుట్లు వేయించుకొని మరి ఎన్నికల్లో జనసైనికులు చాలా ధైర్యంగా నిలబడ్డారు. దానికి దమ్మాలపాడు గ్రామమే నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం. సామాన్యులు అసామాన్య రీతిలో గెలవడం, ఎన్ని అవాంతరాలు కలిగించినా నిలబడిన వారికి, పోటాపోటీగా పోరాడి కొద్ది తేడాతో ఓటమిపాలైన వారికి, ఇంతటి పోరులో గెలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =