విజయవాడలో డా.వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Launches 500 YSR Thalli Bidda Express Vehicles Today, AP CM YS Jagan Mohan Reddy Launches 500 YSR Thalli Bidda Express Vehicles Today, YS Jagan Launches 500 YSR Thalli Bidda Express Vehicles Today,, AP CM YS Jagan Mohan Reddy to Launch 500 YSR Thalli Bidda Express Vehicles on April 1st, AP CM YS Jagan to Launch 500 YSR Thalli Bidda Express Vehicles, YSR Thalli Bidda, Thalli Bidda Express Vehicles, 500 YSR Thalli Bidda Express Vehicles, YSR Thalli Bidda Express Vehicles, YSR Thalli Bidda Express Vehicles Latest News, YSR Thalli Bidda Express Vehicles Latest Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం డా.వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో అధునాతన వసతులతో కూడిన 500 వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను సీఎం వైఎస్‌ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేలా ఉచిత రవాణా సేవలు అందించేందుకు ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎయిర్ కండిషర్డ్ వసతులతో ఉన్న 500 కొత్త వాహనాలను ఈ రోజు రాష్ట్ర నలుమూలలకు పంపుతున్నాం. ప్రతి అక్కకు, చెల్లెమ్మలకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం మొదటిరోజునుంచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే వారి కోసం ఈ వాహనాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాం. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఈ వాహనాల్లో సురక్షితంగా ఇంటివద్ద దింపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో అరకొరగా వాహనాలు ఉండేవి, కొన్ని చోట్ల అందుబాటులో కూడా ఉండేవి కావు, వసతులు కూడా అంతంత మాత్రమే. ఆ పరిస్థితి నుంచి నేడు అన్ని సదుపాయాలతో ఈ వాహనాలను తీసుకొస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థలు, రూపురేఖలు మారుతున్నాయి” అని అన్నారు. ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =