దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పందం

AP CM YS Jagan Meets WEF Founder In Davos, AP CM YS Jagan Mohan Reddy Meets WEF Founder In Davos, CM YS Jagan Mohan Reddy Meets WEF Founder In Davos, CM YS Jagan Meets WEF Founder In Davos, AP CM Meets WEF Founder In Davos, WEF Founder, Davos Tour, AP CM YS Jagan Davos Tour, AP CM YS Jagan Davos Tour News, AP CM YS Jagan Davos Tour Latest News, AP CM YS Jagan Davos Tour Latest Updates, AP CM YS Jagan Davos Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి దావోస్‌ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్ దావోస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. డబ్ల్యూఈఎఫ్‌లో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులలో ఏపీ పాల్గొననుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు వేదికగా డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనున్న సంగతి తెలిసిందే. తద్వారా డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది.

ఈ ఒప్పందం ద్వారా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రాష్ట్రానికి కొత్త టెక్నాలజీ యాక్సెస్, పరిశ్రమకు నాణ్యమైన మానవ వనరులు, స్థిరమైన ఉత్పత్తులు, రాష్ట్ర-నిర్మిత ఉత్పత్తుల కోసం ప్రపంచవ్యాప్త పంపిణీ వ్యవస్థలు, డేటా భాగస్వామ్యం మరియు ఉత్పత్తులకు విలువ జోడింపు, వంటి ఆరు అంశాలలో రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్‌ను సీఎం జగన్ కలిశారు. అనంతరం ఏపీ లాంజ్‌లో బీసీజీ గ్లోబల్ చైర్మన్ హన్స్ పాల్ బార్క్‌నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికగా జరిగే స్వాగత సత్కారానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.

మరోవైపు దావోస్‌లోని జ్యూరిచ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరోకియారాజ్‌ సీఎంకు స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సెకండ్ సెక్రటరీ రాజీవ్ కుమార్, స్విట్జర్లాండ్‌లోని ఎంబసీ సెకండ్ సెక్రటరీ బిజు జోసెఫ్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =