ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసులకు గాను 235 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 911 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడారు. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, ప్రతి 10 లక్షల జనాభాకు గానూ 1396 టెస్టులు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- లాక్డౌన్కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు.
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్డీఎల్ ల్యాబ్ కూడా లేదు.
- ఈనెల రోజుల్లోనే కరోనా టెస్టుల కోసం రాష్ట్రంలో 9 వీఆర్డీఎల్, 44 ట్రూనాట్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం.
- ఇప్పటివరకు రాష్ట్రంలో 74,551 మందికి కరోనా పరీక్షలు చేశాం.
- రాష్ట్రంలో మొత్తం 676 మండలాలకు గానూ రెడ్జోన్లో 63, ఆరెంజ్ జోన్లో 54, గ్రీన్ జోన్లో 559 మండలాలున్నాయి.
- క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటుగా, విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలలో కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం.
- పీపీఈలు, ఎన్95 మాస్కులు అన్ని ఆసుపత్రుల్లో సంవృద్ధిగా ఉన్నాయి.
- ప్రతి జిల్లాలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశాం.
- కరోనా వ్యాధి సోకినా, లేదా సోకినా వారి పట్ల అంటరానితనంగా భావించొద్దు. 80శాతం మందికి కరోనా ఉన్నట్లుగా తెలియనే తెలియడం లేదు.
- రాష్ట్రంలో ప్రతి ఇంటికి మాస్కులు అందజేస్తున్నాం. ప్రతి మనిషికి మూడు మాస్కులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.
- 14410 నెంబర్ తో ప్రత్యేకంగా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ప్రారంభించాం. కరోనాకే కాకుండా మిగతా వ్యాధులకు కూడా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
- ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం.
- గత నెలరోజుల్లో మూడుసార్లు ఉచితంగా రేషన్ అందించే ఏర్పాట్లు చేశాం.
- ప్రతి పేద కుటుంబానికి రూ.వెయ్యి ఆర్ధిక సాయం అందించాం.
- ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గొప్పగా పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాప్ చెబుతున్నా.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu