విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన కమిటీ, 28న విశాఖ బంద్‌కు పిలుపు

AP Committee Calls For Visakhapatnam Bandh on 28th To Protect Steel Plant, Committee Calls For Visakhapatnam Bandh on 28th To Protect Steel Plant, Visakhapatnam Bandh on MAR 28th, Protect Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant, Steel Plant, Visakhapatnam Bandh, Visakhapatnam Bandh Latest News, Visakhapatnam Bandh Latest Updates, Visakhapatnam Bandh Live Updates, AP, Visakhapatnam Steel Plant Protect, Bandh, vizag Bandh, Mango News, Mango News Telugu,

విశాఖ స్టీల్ ‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమం రేపటితో 400 రోజులు పూర్తిచేసుకోనున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. స్టీల్‌ ప్లాంట్ ను కాపాడుకోవటానికి అవసరమైతే ఢిల్లీ వరకూ వెళ్లి పోరాడుతామని కమిటీ హెచ్చరించింది. దీనిలో భాగంగా ఈనెల 28న విశాఖ బంద్‌ నిర్వహించానున్నామని పరిరక్షణ సమితి నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోరాట సమితి నేతలు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

28న తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని, ఒకే మాటపై నిలబడాలని స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి రూ. 5వేల కోట్లు పన్నుల ద్వారా ప్లాంట్‌కు చెల్లిస్తున్నామని కమిటీ నాయకులు పేర్కొన్నారు. కేంద్రం అన్యాయంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి చూస్తోందని.. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని నాయకులు ప్రకటించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం మార్చుకునే వరకు ఉద్యమిస్తామని, పోరాటంలో భాగంగా ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలిసి వందమంది ఎంపీల సంతకాలను సేకరించి కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + six =