సాయితేజ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Andhra Pradesh Government Announces Rs 50 Lakh Ex Gratia, Ap CM Y S Jagan Mohan Reddy, Ap Govt Announced an ex gratia of Rs. 50 lakh to the family of Naik Sai Teja, AP Govt Announces, AP Govt Announces Rs 50 Lakh Ex Gratia, AP’s IAF Officer, AP’s IAF Officer Airlifted, Chopper Crash Updates, Full Military Honours For Victims, Indian Air Force, Indian Army Helicopter Crash, Lance Naik Sai Teja, Lance Naik Saiteja wife Shyamala daughter Darshini and son Mokshgna, mango news telugu, Tamil Nadu Chopper Crash, Tamil Nadu IAF Helicopter crash, Y S Jagan Mohan Reddy Announces Rs 50 Lakh Ex Gratia, ys jagan mohan reddy

ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తోపాటు మరో 12 మంది కూడా ఆ ప్రమాదంలో మరణించిన విషయం విదితమే. వారిలో ఒకరైన లాన్స్ నాయక్ సాయితేజ చిత్తూరు జిల్లా వాసి. సాయితేజ అకాల మరణం ఆ కుటుంబానికి తీరని వేదనని మిగిల్చింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది.

త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు సెక్యూరిటీ ఆఫీసర్ గా సాయితేజ పనిచేసారు. ప్రమాదం జరిగిన రోజు కూడా సాయితేజ రావత్ తో పాటుగా హెలికాప్టర్ లో ఉన్నారు. ఊహించని విధంగా హెలికాప్టర్ కూలిపోవడంతో సాయితేజ అసువులు బాసారు. కాగా, ప్రమాద ఘటనలో ఛిద్రమైన మృతదేహాలకు పరీక్షలు నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. సాయితేజ మృతదేహం గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో, ఆయన భౌతికాయాన్ని స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని ఎగువరేడకు తరలించనున్నారు. అక్కడ ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + three =