ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి భేటీ

Tollywood Director SS Rajamouli And Producer DVV Danayya Meets AP CM YS Jagan, Tollywood Director SS Rajamouli Meets AP CM YS Jagan, Producer DVV Danayya Meets AP CM YS Jagan, Tollywood Director SS Rajamouli, Producer DVV Danayya, Director SS Rajamouli, SS Rajamouli, DVV Danayya, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, YS Jagan Mohan Reddy, CM YS Jagan, SS Rajamouli Meets AP CM YS Jagan, DVV Danayya Meets AP CM YS Jagan, Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ ‌ను కలిశారు. అయితే, ఈమధ్యే ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దానయ్య నిర్మాణ సారధ్యంలో, దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. మొదటివారంలో సినిమా టిక్కెట్ల ధరల వెసులుబాటు, బెనిఫిట్ షోల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here