గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

COVID-19 COVID-19, Gandhi Hospital Gandhi Hospital,Harish Rao Harish Rao, Mango news, Mango news Telugu,Harish Rao Inaugurate CT Scan Services In Gandhi Hospital, Harish Rao Inaugurate CT Scan Services In Gandhi Hospital,Telangana State Health Minister T Harish Rao, Telangana State Health Minister, T Harish Rao Gandhi Hospital in Hyderabad, Gandhi Hospital in Hyderabad,Cath Lab at Gandhi Hospital Cath Lab at Gandhi Hospital,,Cath Lab is ready at Osmania Hospital Cath, Lab is ready at Osmania Hospital,Harish Rao in Gandhi Hospital,TRS health Minister t Harish Rao,

కోవిడ్ కష్ట సమయంలో వేల మందికి సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రికి దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రాణాలు పోతున్న చివరి దశలో కూడా గాంధీకి వస్తే బ్రతుకుతామనే ఆశ చాలామందిలో ఉండటానికి కారణం అక్కడ పనిచేస్తున్న వైద్య బృందమే అని మంత్రి కొనియాడారు. కోవిడ్ వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు 84 వేల మందికి పైగా సేవలందించి, వారి ప్రాణాలను కాపాడిన గాంధీ ఆసుపత్రి తెలంగాణకే గర్వకారణమని మంత్రి అభినందించారు. అధునాతన సౌకర్యాలతో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్ యూనిట్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హరీష్ రావు తో పాటుగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 21 సీటీ స్కాన్ యూనిట్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని వైద్యులు చెప్పారని.. ఇది శుభసూచకమని అన్నారు. త్వరలోనే మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు హరీష్ రావు తెలిపారు. కాగా, ఒమిక్రాన్ వేరియెంట్ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. విదేశాలనుంచి వచ్చినవారిలో కేవలం 15 మందికి మాత్రమే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. వారిలో 13 మందికి ఒమిక్రాన్ లేదని ఫలితాలలో వెల్లడయిందని మంత్రి చెప్పారు. మిగిలిన ఇద్దరి ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులలో తిరిగి రోగులను పరామర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =