అమ‌రావ‌తిలో జూన్ 9న శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్షణ.. పాల్గొననున్న గవర్నర్‌ హరిచందన్, సీఎం జగన్

AP Governor Harichandan and CM Jagan To Participates Mahasamprakshan of Srivari Temple on June 9 in Amravati, AP CM Jagan To Participates Mahasamprakshan of Srivari Temple on June 9 in Amravati, AP Governor Harichandan To Participates Mahasamprakshan of Srivari Temple on June 9 in Amravati, Participates Mahasamprakshan of Srivari Temple on June 9 in Amravati, Mahasamprakshan of Srivari Temple on June 9 in Amravati, Mahasamprakshan of Srivari Temple, Srivari Temple Mahasamprakshan, AP Governor Harichandan, Governor Harichandan, Mahasamprakshan, Srivari Temple Mahasamprakshan News, Srivari Temple Mahasamprakshan Latest News, Srivari Temple Mahasamprakshan Latest Updates, Srivari Temple Mahasamprakshan Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

టీటీడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో నిర్మితమవుతున్న శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో జూన్ 9వ తేదీన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హాజరుకానున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్‌ గతవారం అందజేశారు. టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో వీర‌బ్రహ్మంతో క‌లిసి సుబ్బారెడ్డి అమరావతి ఆల‌యంలో జ‌రుగుతున్న ఏర్పాట్లను నేడు ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ట‌ మరియు మ‌హాసంప్రోక్షణ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మ‌హాసంప్రోక్షణ కార్యక్రమానికి ఏపీ గ‌వ‌ర్నర్ హ‌రిచంద‌న్, సీఎం జగన్, విశాఖ శార‌ద పీఠాధిప‌తి విచ్చేస్తార‌ని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి భ‌క్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవ‌కాశం ఉండ‌టంతో.. దానికి తగిన సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కాగా టీటీడీ ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాలలో నిర్మించిన ఆల‌యాల కంటే అమరావతిలోని ఆల‌యం చాలా పెద్దద‌ని, దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించామ‌ని వెల్లడించారు. ఈ ప్రాంతంలో సుమారు 25 ఎక‌రాల స్థలం ఉంద‌ని, ఆల‌యాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. అలాగే అర్టీసీ అధికారుల‌తో చ‌ర్చించి చుట్టుప‌క్కల ఉన్న ప్రాంతాల నుంచి ఇక్కడకు భ‌క్తుల‌ రాకపోకల సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =