ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత, షేక్ సాబ్జీ విజయం

AP MLC election, AP Teacher MLC Elections, AP Teacher MLC Elections 2021, AP Teacher MLC Elections Results, AP Teacher MLC Elections Results 2021, Kalpalatha, Kalpalatha Reddy elected MLC from Krishna-Guntur Teachers, Kalpalatha Reddy Wins Guntur-Krishna Districts Teachers MLC, Kalpalatha Won, Kalpalatha Won in Krishna-Guntur Teachers MLC Elections, Kalpalatha Won in Teachers MLC Elections, Krishna-Guntur Teachers MLC Elections, Krishna-Guntur Teachers MLC Elections Result, Mango News, Teacher MLC elections, Teacher MLC Elections In AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలతకు 6,153 ఓట్లు రాగానే సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై విజయం సాధించినట్టు ప్రకటించారు. ముందుగా ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో చెల్లని ఓట్లు పోనూ విజయానికి 50 శాతం ఓట్లు (6153) అవసరం కాగా మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాలేదు. అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టి కల్పలత విజయం సాధించినట్టుగా పేర్కొన్నారు.

మరోవైపు తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో షేక్ సాబ్జీ గెలుపొందారు.

ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరగగా, మార్చి 17, బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టారు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలో చేపట్టగా, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కాలేజీలో జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో ఉంచలేదు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కృష్ణా-గుంటూరు స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు స్థానాలకు కలిపి 30,972 మంది ఓటర్లుండగా, 92.41 శాతం అనగా 28,622 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =