కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు జిల్లాకు రూ.కోటి కేటాయింపు, 76 సెంటర్లలో 45,240 బెడ్‌లు సిద్ధం

Andhra Pradesh, Andhra Pradesh Government, AP Coronavirus, AP COVID 19 Cases, AP Govt Allotted One Crore to Each District, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Covid Care Center, Covid Care Center Maintenance, COVID-19, One Crore to Each District for Covid Care Center Maintenance

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, కోవిడ్ సెంటర్లలో సౌకర్యాలకు వాడనున్నారు. ఈ ‌సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు అప్పగిస్తునట్టు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ నోడల్ అధికారి కృష్ణ బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 76 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 45,240 బెడ్‌లను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలో క్వారంటైన్ సెంటర్లలో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కోవిడ్-19 బాధితుల ఆహరం కోసం మనిషికి రోజుకు రూ.500 కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పనితీరు సరిగాలేని కోవిడ్ సెంటర్ల బాధ్యులకు క్రమశిక్షణ చర్యలు తప్పవని కృష్ణ బాబు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =