బందరు పోర్టు ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం

AP Government, AP Government Decision Over Badar Port, AP Government Latest Updates, AP Govt Canceled Bandar Port Development, AP Govt Canceled Bandar Port Development Agreement, Bandar Port Development, Bandar Port Development Agreement, bandar port issue, Mango News Telugu, polavaram project issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనుల నుండి నవయుగ కంపెనీను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నాక, ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం(బందరు) పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు ఇచ్చింది. పోర్టు నిర్మాణానికి, మచిలీపట్నం పోర్టు లిమిటెడ్(ఎంపీపీఎల్) తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. 2008లో జరిగిన రాయితీ ఒప్పందాల నుంచి కొన్ని సంస్థలు తప్పుకోవడంతో 2010 లో ఎంపీపీఎల్ సూచన మేరకు నవయుగ కంపెనీను లీడ్ ప్రమోటర్ గా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ 2010 నుండి ఇప్పటివరకు పోర్టు నిర్మాణం దిశగా ఎటువంటి పనులు చేపట్టక పోవడంతో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీపీఎల్ కు 412 ఎకరాలను అప్పగించింది. పోర్టు నిర్మాణ పనులపై ఎలాంటి పురోగతి లేకపోగా, ఆ భూములకు సంబంధించిన లీజ్ డీడ్ చేసుకోలేదని, ఇప్పటివరకు ఎటువంటి అద్దె కూడ చెల్లించలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంపీపీఎల్ తో ఒప్పందం రద్దు చేసుకోవడంతో పాటు, కేటాయించిన స్థలాన్ని కూడ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన నష్టపరిహారాన్ని కూడ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ నుంచి వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో లో తెలియజేసారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here