హోంశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక సమీక్ష.. దిశ యాప్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశాలు

AP CM YS Jagan Holds Review Meeting on Home Department Directs Officials To Hold Special Drive on Disha App,AP CM YS Jagan Holds Review Meeting on Home Department,YS Jagan Holds Review on Disha App,YS Jagan Holds review on Home Department,Disha App,Mango News,Mango News Telugu,Special Drive On Disha App,Disha App Latest News And Updates,CM YS Jagan Latest News And Updates,Home Department Directs Officials,Disha App Latest News,Disha App Latest Updates,Andhra Pradesh Latest News And Updates

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ‘దిశ’ ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు నిరంతరం యాక్టివ్‌గా ఉండాలని, మహిళలు ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సహకారం అందించాలని సూచించారు. అలాగే అవసరంలో ఉన్న మహిళలు తమ సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌తో పోలీసులకు ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించాలని కోరారు.

ఇక దిశ యాప్‌పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ అందించాలని, వారు నిర్వహిస్తున్న విధులు, బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేపడుతుండాలని సీఎం జగన్ సూచించారు. దిశ యాప్‌ ప్రతి ఇంటిలోని మహిళలు తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రోత్సహించాలని, యాప్ వలన కలిగే ప్రయోజనాలను వివరించాలని, అవసరమైతే కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి రెండు వారాలకోసారి కలెక్టర్, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించాలని, పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూడాలని కోరారు. కాగా ప్రతి పీఎస్‌లో దిశ ఎలా పని చేస్తుందో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని, బాధితులను ఆదుకోవడంలో జాప్యం చేయరాదని స్పష్టం చేసిన సీఎం జగన్.. రాష్ట్రంలో గంజాయి రవాణా, సరఫరాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =