ఏపీలో ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ ఫంగస్ చికిత్స, సీఎం జగన్ ఆదేశాలు

AP Govt Decides to Treat Black Fungus Cases Under AarogyaSri Scheme,Covid-19,Andhra Govt Adds Black Fungus To Aarogyasri,AP Government Adds Coronavirus Under Aarogyasri Scheme,Coronavirus,AP Govt To Cover Black Fungus Cases Under Arogyasri,Black Fungus,Black Fungus Cases,Black Fungus Cases In AP,Covid-19 Andhra Pradesh,AP Govt Adds Black Fungus To Aarogyasri Scheme,CM Jagan,CM Jagan Live,CM Jagan Latest News,CM Jagan Pressmeet,CM Jagan Live Updates,CM Jagan Latest News,Andhra Pradesh,AP Corona Updates,Ap Coronavirus Cases Today,COVID-19,AP COVID-19 Updates Today,Covid-19 in AP,AP Govt Decides to Treat Black Fungus,Black Fungus Cases AP,AarogyaSri Scheme,AarogyaSri

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ వైద్య సేవలు అందిచేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ తో రాష్ట్రంలో ఎక్కడా మరణాలు సంభవించినట్లు సమాచారం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామన్నారు. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన మందులు, ఇంజక్షన్ల కొనుగోలుకు టెండర్లు పిలవాలని సీనియర్ అధికారుల కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

మధుమేహం తీవ్రంగా ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని, సరైన సమయంలో గుర్తిస్తే ఆ వ్యాధిని సులభంగా నివారించొచ్చునని నిపుణులు తెలిపారన్నారు. బ్లాక్ ఫంగస్ పై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే ప్రైవేటు ఆసుపత్రులు తక్షణమే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇందుకుగానూ నోటిఫికేషన్ ను ఒకట్రెండు రోజుల్లో జారీచేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.

3 రోజుల్లో 91 వేల మంది జ్వరపీడుతుల గుర్తింపు:

మరోవైపు రాష్ట్రంలో మూడు రోజుల నుంచి ఫీవర్ సర్వే సాగుతోందని తెలిపారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 91 వేల మంది జ్వరపీడుతులను గుర్తించామన్నారు. జ్వరపీడితులకు టెస్టుల చేయడంతో పాటు హోం ఐసోలేషన్లు కిట్లు ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కేసు గురించి క్షుణ్నంగా ఆరా తీస్తున్నామన్నారు. అంబులెన్స్ లు అందుబాటులో పెట్టి, అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =