బ్లాక్ ఫంగస్ లక్షణాలు, ఎవరికి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Black Fungus Symptoms, Causes and Preventive Measures,Mango News,Mango News Telugu,COVID-19,COVID-19 Updates,Black Fungus,What Causes Black Fungus,How To Prevent Black Fungus,Black Fungal Disease Infection Symptoms,Black Fungal Disease,Black Fungus Infection,Causes,Black Fungus Infection in Covid,Symptoms of Black Fungus,What Is Black Fungus,COVID-19 in India,COVID-19 and Black Fungus,Black Fungal Infection,Symptoms,How Does Black Fungus Spread,How Does Black Fungus Occurs,Black Fungus Covid,Black Fungus Symptom,Black Fungus In India,Black Fungus Covid India,Black Fungus Covid Symptoms,Black Fungus Explained,Black Fungus Corona,Black Fungus Preventive Measures

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనాకు తోడు కొందరు ప్రజలు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి బారినపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా బారినపడి కోలుకున్న కొందరికి తర్వాతి దశలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, కరోనా వచ్చిన వారంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మ్యూకోర్ మైకోసిస్ శరీరంలోని ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు (సైనసస్), కన్ను, మెదడు మరియు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కరోనా నుండి కోలుకున్నవారిలో మధుమేహం (షుగర్) వ్యాధి నియంత్రణలో లేని వారిలో కొద్దిమందికి వ్యాధి సోకుతుంది. కాగా ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, వాతావరణంలోని గాలిలో తిరుగుతున్న ఈ ఫంగస్ కు చెందిన స్పోర్స్ ను పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్దకు చేరుతుందని చెప్పారు. కరోనా సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మరోవైపు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలపై ఐసీఎంఆర్ కొన్ని కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు:

  • ముఖంపై నొప్పి/వాపు
  • కళ్ళు వాయడం, చూపు మందగించడం
  • తలనొప్పి, కంటి నొప్పి/కళ్లు ఎర్రబడడం
  • జ్వరం
  • రక్తపు వాంతులు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • దంతాల్లో నొప్పి
  • నిరంతర దగ్గు
  • మానసిక స్థితిపై ప్రభావం

బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తుంది?

  • షుగర్ వ్యాధి నియంత్రణలో లేనివారికి
  • స్టెరాయిడ్స్ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి కోల్పోయిన వారికి
  • అవయవమార్పిడి చికిత్స చేసుకొని మందులు వాడుతున్నవారికి
  • దీర్ఘకాలీకంగా ఐసీయూలో చికిత్స పొందిన వారు
  • వారికోనజోల్ థెరపీ

బ్లాక్ ఫంగస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి
  • కరోనా నుంచి కోలుకున్నాక షుగర్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం
  • చికిత్సల్లో స్టెరాయిడ్లను డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి
  • మంచి పోషకారం తీసుకోవడం
  • ఆక్సిజన్ థెరపీ తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన నీటిని వాడడం
  • యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్స్ డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి
  • దుమ్ము ప్రదేశాల్లో మాస్కులు ధరించుట

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 20 =