మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Moves Supreme Court For Stay on High Court Verdict of Three Capitals Issue, AP Govt Three Capitals Issue, AP Govt Moves Supreme Court of Three Capitals Issue, AP Assembly Three Capitals, AP Three Capitals, Mango News, Mango News Telugu, Amaravati Farmers Three Capitals of AP, Three Capitals of AP, Amaravati Farmers, Maha Padayatra, AP Three Capitals, Andhra Pradesh News, AP Three Capitals New Ammendment, AP Three Capitals Discussion, AP Legislative Assembly, AP MLA Latest News And Updates, AP Assembly Speaker, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఎలాగైనా సరే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తీర్పును వెలువరించింది. కాగా దీనిపై సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని పిటిషన్‌లో ప్రభుత్వం వివరించిన ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిలో అభివృద్ధి చేయాలని చెప్పారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని, హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =