బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తండ్రి మృతికి పరామర్శ

Hyderabad Union Minister Amit Shah Meets BJP MLA Etela Rajender at His House Today, Union Minister Amit Shah Meets Etela Rajender, Shah Condolences on Etala Fathers Death, Union Minister Amit Shah , BJP MLA Etela Rajender, Mango News, Mango News Telugu, Minister Amit Shah , MLA Etela Rajender, Etela Rajender Latest News And Updates, Amit Shah News And Live Updates, Amit Shah, Etela Rajender, Hyderabad News

తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం వరుసగా పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రం ఆధ్వర్యంలో తొలిసారి అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో కోర్ కమిటీ మీటింగ్ జరిపారు. ఆ తర్వాత సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇక రోజంతా బిజీబిజీగా ఉన్న అమిత్ షా ఈ క్రమంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్లారు.

హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన అమిత్ షా, ఈటలను పరామర్శించారు. కాగా గత నెలలో ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య (104) మృతి చెందిన సంగతి తెలిసిందే. సుమారు 30 నిమిషాలు ఈటల నివాసంలో గడిపిన అమిత్ షా.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం, రాష్ట్రంలో బీజేపీ అవకాశాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో సభ నుంచి ఈటలను సస్పెండ్ చేసిన విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా అమిత్ షా, టీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో దూకుడుగానే వెళ్లాలని రాజేందర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఇక అమిత్ షాతో పాటు ఈటల రాజేందర్‌ నివాసానికి వచ్చిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =