విజయవాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్

AP Governor Biswabhusan and CM Jagan Participates National Constitution Day Celebrations in Vijayawada Today,AP Governor Biswabhushan,AP CM YS Jagan Mohan Reddy, Constitution Day celebrations,Vijayawada National Constitution Day Celebrations,National Constitution Day Celebrations,Mango News,Mango News Telugu,Prime Minister Of India,Prime Minister Narendra Modi,Prime Minister Latest News And Updates,Prime Minister Narendra Modi,Modi Congratulated Anwar Ibrahim,Prime Minister Modi Latest News and Updates,India News and Live Updates,India

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారు భారత రాజ్యాంగ సృష్టికర్త డా. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది దేశపౌరులందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ వంటిదని పేర్కొన్న సీఎం జగన్.. మన భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, దశాబ్దాలుగా దేశంలో అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి అన్ని సామజిక వర్గాల అభ్యున్నతికి, ప్రగతికి ఈ రాజ్యాంగం దోహద పడిందని ఆయన అన్నారు. మనకు ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన డా. బీఆర్ అంబేడ్కర్ గారికి దేశమంతా రుణపడి ఉంటుందని, దీనిని ఆయన సుమారు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించారని సీఎం జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + five =