ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన అంగన్వాడీలు

Negotiations With The Government Have Been Successful Anganwadis Have Called Off The Strike, Negotiations With The Government, Anganwadis Have Called Off The Strike, Negotiations Anganwadis, AP, Anganvadees, AP Government, YCP, CM Jagan, Minister Botsa Satyanarayana, Latest Anganwadis Strike News, Anganwadis Strike News Update, YCP, Political News, Mango News, Mango News Telugu
AP, Anganvadees, AP Government, YCP, CM Jagan, Minister botsa satyanarayana

ఏపీలో నెలరోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు దిగారు. రోజురోజుకు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని.. లేదంటే శాశ్వతంగా వారిని తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ అంగన్వాడీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరింత సమ్మెను ఉధృతం చేశారు. ఈక్రమంలో ఛలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఈక్రమంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించారు.

సోమవారం అంగన్వాడీ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. వారితో చర్చలు జరిపారు. వారి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు, సమస్యలను అంగన్వాడీలు మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తమ వేతనాలు కూడా పెంచాలని కోరారు. ఈక్రమంలో అంగన్వాడీల డిమాండ్ల పట్ల అటు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఒక్కొక్కటిగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. జూన్‌లో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అనంతరం యథావిధిగా విధులకు హాజరుకావాలని మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలను కోరారు.

అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అంగన్వాడీ ప్రతినిధులు ప్రకటించారు. జూన్‌లో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం నుంచి విధావిథిగా విధులకు హాజరవుతామని అంగన్వాడీలు ప్రకటించారు.  మరోవైపు అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని.. వాటిలో పది డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వేతనాలు జూన్‌లో పెంచుతామని హామీ ఇచ్చామని అన్నారు.

త్వరలోనే మినీ అంగన్వాడీలను కూడా.. పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మారుస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 1.20 లక్షలకు పెంచామని.. హెల్పర్స్‌కు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 60 వేలకు పెంచామని చెప్పుకొచ్చారు. అలాగే చనిపోయిన అంగన్వాడీల మట్టి ఖర్చుల కోసం రూ. 20 వేలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా అంగన్వాడీలపై నమోదయిన కేసులను త్వరలోనే సీఎం జగన్‌తో చర్చలు జరిపి ఎత్తివేస్తామని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =