ఎల్జీపాలిమర్స్ విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోలేం, అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలు అరికట్టలేరా?: పవన్ కళ్యాణ్

Janasena President Pawan Kalyan Responds Over Atchyutapuram SEZ Incident, JSP President Pawan Kalyan Responds Over Atchyutapuram SEZ Incident, Janasena Chief Pawan Kalyan Responds Over Atchyutapuram SEZ Incident, Pawan Kalyan Responds Over Atchyutapuram SEZ Incident, Janasena Chief Responds Over Atchyutapuram SEZ Incident, Atchyutapuram SEZ Incident, Janasena President Pawan Kalyan, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan, Janasena President, Atchutapuram Gas Leakage Incident, toxic gas leak incident in Atchutapuram SEZ, Atchutapuram SEZ, toxic gas leak incident in Vizag, Atchyutapuram SEZ Incident News, Atchyutapuram SEZ Incident Latest News, Atchyutapuram SEZ Incident Latest Updates, Atchyutapuram SEZ Incident Live Updates, Mango News, Mango News Telugu,

విశాఖనగరం సమీపంలో ఉన్న అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “విశాఖలో ఎల్.జి పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించింది, ఎంతమంది ప్రాణాలను హరించింది. వందలాది మందిని శాశ్వత అనారోగ్యానికి గురి చేసిందో ఎప్పటికీ మరచిపోలేము. అచ్యుతాపురం సెజ్ లో మంగళవారం సాయంత్రం దుస్తులు తయారుచేసే సీడ్స్ అనే కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణం. ఇదే కంపెనీలో నెల క్రితమే ఇటువంటి ప్రమాదం జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది మళ్లీ పునరావృతం అయింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏమిటో అటు అధికారులుగాని, ఇటు కంపెనీ ప్రతినిధులుగాని చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి. ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాలి. దుస్తుల కర్మాగారం వాయు ప్రమాదంలో అస్వస్థతకు మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 8 =