ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీ, నాలుగు స్థానాలు కైవసం

AP MLC Election Results YSRCP Clean Sweeps The Local Body Quota as Wins Four Seats,AP MLC Election Results,YSRCP Clean Sweeps The Local Body Quota,YSRCP Wins Four Seats,AP YSRCP MLC Election,Mango News,Mango News Telugu,YSRCP Makes Clean Sweep,Local Polls in Andhra Pradesh,Andhra Pradesh MLC Elections Result 2023,YSR Congress Party Clean Sweeps,Andhra MLC polls,AP MLC Elections 2023,AP MLC Elections Latest Updates,AP MLC Elections Latest News

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల మరియు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముందుగా ఏపీలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అధికార వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ సాధించింది. శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. ఆయనకు 632 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. ఇక కర్నూలులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌ గెలిచారు. 988 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. ఇక పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా ఉండటంతో తుది ఫలితాలు వెల్లడవడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + three =