ఏపీలో నేటి నుంచి స్కూల్స్ పునః ప్రారంభం.. నూతనంగా ఆరు అంచెల విధానం అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు

AP Schools Reopen From Today as Per Schedule After Summer Holidays, AP Schools Reopening Dates Out, AP Schools Reopen From Today, AP Schools Reopen as Per Schedule After Summer Holidays, Schedule After Summer Holidays, AP Schools Academic Calendar 2022-23, Andhra Pradesh Schools To Reopen, Andhra Pradesh government, AP Schools Reopen, Andhra Pradesh Schools Reopen, AP Schools Reopen News, AP Schools Reopen Latest News, AP Schools Reopen Latest Updates, AP Schools Reopen Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి బడి గంటలు మోగనున్నాయి. సుదీర్ఘ సెలవుల తరువాత పిల్లలు పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం మొదటి రోజునే విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను అందించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు. ఈ కిట్లలో మూడు జతల యూనిఫాం, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌, టెక్స్‌ బుక్స్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌-తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్‌ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌లో ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు.

కాగా ఈ సారి ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్‌ ప్లస్‌ వంటి ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లను కొత్తగా ప్రారంభించనున్నారు. మరోవైపు విలీన ప్రక్రియ అమలు చేస్తోన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రస్తుత స్కూళ్ళకు సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. దీనిననుసరించి ఏ రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో సమగ్రంగా వివరించింది. ఇక ఈ విద్యా సంవత్సరానికి గాను 220 రోజులను పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here