‘రిపబ్లిక్ డే’ వేడుకలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ శకటం.. ఏ ఇతివృత్తంతో తయారైందంటే?

AP Tableau Selected For The Republic Day Parade 2023 Designed by Pongal Theme,AP Tableau For The Republic Day,AP Tableau For Republic Day,Republic Day Parade 2023,AP Tableau Pongal Theme,Mango News,Mango News Telugu,Republic Day Parade Timing,Republic Day Parade Tickets,Republic Day Parade Starts From,Republic Day Parade Route Map,Republic Day Parade Live Telecast,Republic Day Parade Live,Republic Day Parade India,Republic Day Parade In New Delhi Starts From,Republic Day Parade 2023 News,Republic Day Parade 2023,Republic Day Parade,Live Republic Day Parade 2023,India Republic Day Parade,Delhi Republic Day Parade,Cost Of Republic Day Parade

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక శాఖలు బుధవారం దీనిపై అధికారిక ప్రకటన చేశాయి. ఇక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అత్యుతమ శకటాలు రానుండగా.. ఈ సారి ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి రూపొందించింది. డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ‘ప్రబల తీర్ధం’ పేరుతో, సంక్రాంతి ఉత్సవం (పొంగల్ థీమ్) ఇతివృత్తంతో దీనిని రూపొందించడం విశేషం. కాగా ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని రాజ్‌పథ్‌లో వివిధ శకటాల ప్రదర్శన ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘రిపబ్లిక్ డే’ వేడుకలకు దక్షిణ భారతదేశం నుండి ఏపీతో పాటు కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం లభించింది.

ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే శకటాల ఎంపిక ప్రక్రియలో చాలా వడపోతలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, శిల్పకళలు, నాట్యం, సంగీతం, ఆర్కిటెక్చర్‌ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తారు. ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటవుతుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాల ప్రతిపాదనలకు సంబంధించిన స్కెచ్చులు లేదా డిజైన్లను పరిశీలించి వీరు సలహాలు, సూచనలు అందిస్తారు. శకటాల డిజైన్లలో ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే సూచీస్తారు. సాధారణంగా వివిధ రకాల రంగులతో, చదవడానికి వీలుగా, అనవసరమైన వివరాలు లేకుండా స్కెచ్‌ ఉండాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అనంతరం శకటాల ఎంపిక చేస్టారు. ఇలా ఎంపిక చేసిన శకటాలకు మాత్రమే రాజ్‌పథ్‌లో ప్రదర్శనకు అర్హత లభిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − two =