ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత

AP Taneti Vanitha Takes Charges as Home Minister Today at Secretariat, Taneti Vanitha Takes Charges as Home Minister Today at Secretariat, Taneti Vanitha Takes Charges as Home Minister Today, Home Minister, Home Minister Taneti Vanitha, Taneti Vanitha, AP Secretariat, AP Cabinet Minister Taneti Vanitha, Minister Taneti Vanitha, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వనిత మాట్లాడుతూ.. సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇప్పటికే ఏపీకి పలు జాతీయ అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తామని, ఈ దిశగా పలు ఆచరణాత్మక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ఏపీలో ఏర్పాటు చేసిన దిశ చట్టం.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా కూడా, రాష్ట్రంలో దానిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దిశా యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడామని, దిశ బిల్లును చట్టం చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజని నేడు బాధ్యతలు చేపట్టారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా మంత్రి రజని పేర్కొన్నారు. అలాగే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, అత్యుత్తమ పనితీరు కనబరుస్తానని చెప్పారు. డా. బీఆర్ అంబేద్కర్‌ మరియు జగ్జీవన్‌రామ్ తమకు ఆదర్శమని తెలియపరు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =