తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. మంత్రి హరీష్ రావు వెల్లడి

Telangana Police Recruitment Notification Within One Week Says Minister Harish Rao, Police Recruitment Notification Within One Week Says Minister Harish Rao, Minister Harish Rao Says Police Recruitment Notification Within One Week, Police Recruitment Notification Within One Week, Telangana State Police Recruitment 2022, Telangana Police Jobs 2022 Notification Will Be Released in A Week, Telangana Police Jobs 2022 Notification Will Be Released in A Week Says Telangana Minister Harish Rao, TS Police jobs, Police Recruitment notification within one week says Minister Harish Rao, Telangana State Govt Jobs Notifications 2022, TS Police Recruitment 2022 News, TS Police Recruitment 2022 Latest News, TS Police Recruitment 2022 Latest Updates, TS Police Recruitment 2022 Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హ‌రీష్ రావు, రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఒక శుభవార్త వినిపించారు. తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పటాన్‌చెరువు లోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మంత్రి హరీశ్‌ రావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల్లో 20 వేల వరకు ఖాళీలు పోలీస్‌ శాఖలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లోనే ఈ పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కనుక అభ్యర్థులంతా పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

దేశంలో ఎక్కడా లే‌ని విధంగా పోలీస్ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించామ‌ని హరీష్ తెలిపారు. దీనితో పాటు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, దీని వలన ఉద్యోగాల కోసం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితిని తప్పించమని తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని, అలాగే విద్యార్థుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ మూడేళ్ల వయోపరిమితి సడలింపుకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, దీనికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకుంటున్న గొప్ప నిర్ణయాల వల్లేనని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =