దావోస్ సదస్సులో ఏపీ పాలసీలు, ప్రాధాన్యతలు వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తాం – మంత్రి అమరనాథ్‌

AP To Showcase Its Growth Trajectory at WEF Conference at Davos Says Minister Amarnath, Minister Amarnath Says AP To Showcase Its Growth Trajectory at WEF Conference at Davos, AP To Showcase Its Growth Trajectory at WEF Conference at Davos, WEF Conference at Davos, AP To Showcase Its Growth Trajectory, Growth Trajectory, Davos, WEF Conference, AP Minister Amarnath, Minister Amarnath, Minister Gudivada Amarnath, Minister of Industries, Minister of Infrastructure, Minister of Investment and IT, WEF Conference News, WEF Conference Latest News, WEF Conference Latest Updates, Mango News, Mango News Telugu,

దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏపీ తన వృద్ధి పథాన్ని ప్రదర్శిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మన రాష్ట్రం ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను డబ్ల్యూఈఎఫ్‌లో ‘ఫోరమ్ మెంబర్ అసోసియేట్’ నుంచి ‘ఫోరమ్ ప్లాట్‌ఫారమ్ భాగస్వామి’గా ఎలివేట్ చేస్తున్నామని, దీని కోసం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక-ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు.

యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజిలు), సుస్థిర ఉత్పాదక పద్ధతులను అవలంబించడం మరియు డీకార్బనైజ్డ్ ఎకానమీకి మారడం వంటి వాటిపై తగిన దృష్టి సారించి రాష్ట్ర వృద్ధి కథనాన్ని ప్రతినిధి బృందం డబ్ల్యూఈఎఫ్‌ లో ప్రదర్శిస్తుందని అమర్‌నాథ్ చెప్పారు. అలాగే సీఎం జగన్ సదస్సులో ‘2030 ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఎజెండా’ అనే థీమ్‌పై సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు. డబ్ల్యుఇఎఫ్‌ సదస్సుకు హాజరయ్యే వివిధ ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులుకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారని వెల్లడించారు.

దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మే 22 నుంచి 26 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) – 2022 52వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు పి.వి. మిధున్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ ఎం. గోవిందారెడ్డి, పరిశ్రమలు, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వెంట పర్యటనలో వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =