కర్ణాటకకు చెందిన ప్రకృతి పరిరక్షకులు, పద్మశ్రీ తిమ్మక్కను సత్కరించిన సీఎం కేసీఆర్

CM KCR Felicitates Padma Shri Saalumarada Thimmakka at Pragati Bhavan Today, Telangana CM felicitates 110-year-old environmentalist Saalumarada Thimmakka, CM KCR Felicitates Padma Shri Saalumarada Thimmakka at Pragati Bhavan, Telangana CM KCR Felicitates Padma Shri Saalumarada Thimmakka at Pragati Bhavan, CM KCR Felicitates Padma Shri Saalumarada Thimmakka, Padma Shri Saalumarada Thimmakka, Saalumarada Thimmakka, Pragati Bhavan, Telangana CM felicitates 110-year-old environmentalist Saalumarada Thimmakka at Pragati Bhavan Today, 110-year-old environmentalist Saalumarada Thimmakka, 110-year-old environmentalist, 110-year-old, Padma Shri Thimmakka, Felicitates, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తోడ్కొని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్కను సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఉన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం కేసీఆర్ తిమ్మక్కను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ తిమ్మక్క మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క సీఎంకు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క పడుతున్న తపన, సమావేశంలో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.

పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, మొక్కలే పిల్లలుగా, పచ్చదనం పర్యావరణ హితం కోసం ఆమె పనిచేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మరోవైపు పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ మొక్కల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో, పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కకు సీఎం అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ బాద్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచి పనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించ వచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 14 =