పవన్ కంటే బర్రెలక్కనే బెటర్.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Barrelakkane is Better Than Pawan Jagans Sensational Comments,Barrelakkane is Better Than Pawan,Jagans Comments Barrelakkane is Better,ap politics, pawan kalyan, chandrababu naidu, CM jagan, janasena, ycp, tdp,Mango News,Mango News Telugu,Barrelakka Better Then Package Star,CM Jagan Sensational Comments,Jagan Compares Janasena With Barrelakka,Jagan Comments Latest News,Jagan Comments Latest Updates,CM Jagan Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
ap politics, pawan kalyan, chandrababu naidu, cm jagan, janasena, ycp, tdp

ఏపీలో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే భగ్గుమంటోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పటికీ.. ఇప్పటి నుంచే నేతలు రచ్చ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు.. సవాళ్లకు ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు, పవ్ కళ్యాణ్ ఏపీకి నాన్ లోకల్స్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎక్కడో ఉంటూ.. ఏపీ సీఎం ఎక్కడ ఉండాలో డిసైడ్ చేస్తారట అంటూ భగ్గుమన్నారు. అసలు వారికి ఏపీతో ఏం పని అని జగన్ నిలదీశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతుంటే.. పవన్‌కి చంద్రబాబుకి కడుపు మంట అని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదని చెప్పారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ప్రజలకు చెప్పుకునేందుకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. అసలు ఆయనకు ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రలో చాలా మంది ప్రజలు కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు వారిని పట్టించుకోలేదని.. గాలికొదిలేశారని ఆరోపించారు.సొంత నియోజకవర్గం కుప్పంనే పట్టించుకోని చంద్రబాబు.. ఉత్తరాంధ్రను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. కుప్పంలో తాగు నీరు లేక ప్రజలు అల్లాడిపోయారని.. తాను ముఖ్యమంత్రి అయ్యాకనే కుప్పం ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించానని వివరించారు.  చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు.

ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోకాలు అడ్డుపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. వారు ఎక్కడో ఉంటూ.. ఏపీలో రాజకీయాలు తాము చెప్పినట్లు జరగాలని అంటున్నారని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబుకు మాట ఇస్తే నిలబడే నైజం లేదన్న జగన్.. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క మాటపైనా చంద్రబాబు నిలబడలేదని విమర్శించారు. ఎన్నికలొస్తే చాలు చంద్రబాబుకు పొత్తులు, ఎత్తులు, జిత్తులు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేసిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కనీసం డిపాజిట్లు కూడా రాలేదని దుయ్యబట్టారు. పవన్ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థురాలు బర్రెలక్కనే చాలా బెటర్ అని జగన్ విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =